కొవిడ్‌తో నష్టపోతున్న అరటి వ్యాపారులు

ABN , First Publish Date - 2021-05-31T02:58:39+05:30 IST

కర్ఫ్యూ కారణంగా తాము తీవ్రంగా నష్టపోతున్నామని అరటిపండ్ల వ్యాపారులు వాపోతున్నారు. కొవిడ్‌ను నియంత్రించడంలో భాగంగా మధ్యాహ్నం 12గంటల నుంచి ఉదయం 6గంటల వరకు కర్ఫ్యూను అమలు చేస్తుండడం తెలిసిందే.

కొవిడ్‌తో నష్టపోతున్న అరటి వ్యాపారులు
మగ్గిపోయిన అరటిపండ్లు

గూడూరురూరల్‌, మే 30: కర్ఫ్యూ  కారణంగా తాము తీవ్రంగా నష్టపోతున్నామని అరటిపండ్ల వ్యాపారులు వాపోతున్నారు. కొవిడ్‌ను నియంత్రించడంలో భాగంగా మధ్యాహ్నం 12గంటల నుంచి ఉదయం 6గంటల వరకు కర్ఫ్యూను అమలు చేస్తుండడం తెలిసిందే. దీంతో వ్యాపారం లేక  తోపుడుబండ్లుపై అరటిపండ్లు అమ్ముకునే వారు అవస్థలు పడుతున్నారు. పట్టణంలో సుమారు 70 మంది వరకు బండ్లపై అరటిపండ్లు విక్రయిస్తూ జీవనోపాధిని పొందుతున్నారు.  ఆశించిన మేర విక్రయాలు లేకపోవడంతో సగం సరుకు కుళ్లిపోయి పనికిరాకుండా పోతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని వారు కోరుతున్నారు. 

Updated Date - 2021-05-31T02:58:39+05:30 IST