కొవిడ్‌ సెంటర్‌ పరిశీలన

ABN , First Publish Date - 2021-05-19T05:04:30+05:30 IST

నగర పంచాయతీ పరిధిలోని రామచంద్రాపురంలో ఏర్పాటుచేసిన కొవిడ్‌ సెంటర్‌ను ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి మంగళవారం పరిశీలించారు.

కొవిడ్‌ సెంటర్‌ పరిశీలన
కొవిడ్‌ సెంటర్‌ను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి

 బుచ్చిరెడ్డిపాళెం, మే 18: నగర పంచాయతీ పరిధిలోని రామచంద్రాపురంలో ఏర్పాటుచేసిన కొవిడ్‌ సెంటర్‌ను ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి మంగళవారం పరిశీలించారు. వైద్య సిబ్బందిని, నగర పంచాయతీ కార్యాలయ సిబ్బందిని అభినందించారు. ఈ సందర్భంగా రోగులకు అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట పంచాయతీ కమిషనర్‌ శ్రీనివాసరావు, ఎంపీడీవో నరసింహారావు ఉన్నారు. అనంతరం గుండెజబ్బుతో బాధపడుతున్న ఇసకపాళెం వడ్డేపాళేనికి చెందిన ఆరు నెలల చిన్నారి షణ్ముఖ అభిరామ్‌ ఇంటికి వెళ్లి పరామర్శించారు. చిన్నారి తల్లిదండ్రులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.  ఈ క్రమంలో నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి ట్రస్ట్‌ తరపున రూ.2లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఆర్థికసాయం అందిన తర్వాత  శస్త్రచికిత్స చేయిస్తామని వారికి ధైర్యం చెప్పారు. ఆయన వెంట వైసీపీ నాయకుడు కోడూరు మధుసూదనరెడ్డి ఉన్నారు. 

Updated Date - 2021-05-19T05:04:30+05:30 IST