కోస్టల్‌ కారిడార్‌పై నిగ్గు తేల్చాలి

ABN , First Publish Date - 2021-07-28T02:51:59+05:30 IST

చెన్నై-బెంగళూరు కోస్టల్‌ కారిడార్‌పై ప్రజల అభిప్రాయాలు తెలుసుకోకుండా నివేదికలు తయారయ్యాయని, వెంటనే వాటి నిగ్గు తేల్చాలని

కోస్టల్‌ కారిడార్‌పై నిగ్గు తేల్చాలి
మాట్లాడుతున్న వామపక్ష నాయకులు

కోట, జూలై 27 : చెన్నై-బెంగళూరు కోస్టల్‌ కారిడార్‌పై ప్రజల అభిప్రాయాలు తెలుసుకోకుండా నివేదికలు తయారయ్యాయని, వెంటనే వాటి నిగ్గు తేల్చాలని సీపీఎం,  సీఐటీయూ,, బహుజన సమాజ్‌ పార్టీల నాయకులు డిమాండ్‌ చేశారు. కోటలో మంగళవారం  బీఎస్పీ జిల్లా నాయకులు మీజూరు మాధవ్‌, సీఐటీయూ నాయకులు యాదగిరి, జన నాట్య మండలి నాయకులు హరనాథ్‌, శ్రీనివాసులు విలేకర్లతో మాట్లాడారు. చెన్నై,-బెంగళూరు కోస్టల్‌ ఇండస్ట్రీయల్‌ పార్కు పరిధిలోకి కొత్తపట్నం, సిద్ధవరం, కర్లపూడి పంచాయతీలోని రైతుల భూములు వెళ్లనున్నాయన్నారు. అయితే ఆ భూముల పరిహారం నిర్ణయించడంలో జాబితా  సేకరణ జరపలేదన్నారు. సెటిల్‌మెంట్‌,  డీకేటీ భూములకు పరిహారం సమానంగా ఇవ్వాలన్నారు. 2013  చట్టం ప్రకారం రైతుల నుంచి ఎపీఐఐసీ భూములు కొనుగోలు చేసి 5 సంవత్సరాలలోపు ఆ భూముల్లో పరిశ్రమలు స్థాపించకపోతే వాటిపై సర్వహక్కులు అమ్మిన రైతులకే దక్కె చట్టాన్ని అమలు చేయాలన్నారు. రైతులను మోసగించాలని చూస్తే పుట్టగతులు ఉండవన్నారు.కారిడార్‌ భూములకు సంబంఽధించి తాజాగా ప్రజాభిప్రాయ సేకరణ జరగాలన్నారు. ఈ కార్యక్రమంలో పలు సంఘాల ప్రతినిధులు ఉన్నారు. 


Updated Date - 2021-07-28T02:51:59+05:30 IST