ఆనందయ్య మందు పంపిణీ

ABN , First Publish Date - 2021-06-23T03:35:38+05:30 IST

కరోనా నియంత్రణకు మండలంలోని అయ్యపరెడ్డిపాలెంలో మంగళవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆనందయ్య మందు పంపిణీ చేశారు.

ఆనందయ్య మందు పంపిణీ
కలిగిరి : ఆనందయ్య మందు పంపిణీ చేస్తున్న టీడీపీ నాయకులు

కలిగిరి, జూన్‌ 22: కరోనా నియంత్రణకు మండలంలోని అయ్యపరెడ్డిపాలెంలో మంగళవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆనందయ్య మందు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెదకొండూరు సర్పంచు మొక్కా సుజాత, ఉప సర్పంచు నోటి మాల్యాద్రి రెడ్డి, టీడీపీ సీనియర్‌ నాయకుడు బీవీ రామారావు, బీ వెంకటసుబ్బయ్య, రావూరి పెంచలమ్మ,  మొక్కా హజరత్తయ్య, మాలకొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా చేకూరు బాబూరావు కమ్మవారిపాలెం గ్రామంలో ప్రజలకు ఆనందయ్య మందు అందజేశారు.

అల్లూరు : అల్లూరు నగర పంచాయతీ పరిధిలోని ఆదినారాయణపురంలో  మంగళవారం ఇస్కపల్లి నాయకుడు బీద చైతన్య సమక్షంలో బీఎంఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో  ఆనందయ్య మందు పంపిణీ చేశారు. కరోనా నియంత్రణకు చేపట్టిన మందు పంపిణీ కార్యక్రమంలో ట్రస్ట్‌ ప్రతినిధి మునిరాజ, గ్రామకాపులు పాల్గొన్నారు. 

ఆనందయ్యకు సన్మానం

ఉదయగిరి రూరల్‌ : కృష్ణపట్నం గ్రామానికి చెందిన ఆనందయ్యను మంగళవారం పరుశురామ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆ సంఘ నాయకులు ఘనంగా సన్మానించారు. వేదమంత్రాలతో ఆయన్ను ఆశీర్వదించి పుష్పగుచ్ఛం అందజేశారు.  జిల్లాలో ఉన్న బ్రాహ్మణ కుటుంబీకులందరికి కరోనా మందు అందించాలని ఆయన్ను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మల్లవరపు లక్ష్మీనరసింహారావు, కార్యదర్శి లోకా వెంకటప్రసాద్‌శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-06-23T03:35:38+05:30 IST