మాస్క్‌లతోనే కరోనా దూరం

ABN , First Publish Date - 2021-07-13T04:12:43+05:30 IST

ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించడం ద్వారానే కరోనాకు దూరంగా ఉండవచ్చని వైద్యురాలు నిత్య ప్రశాంతి అన్నారు. పట్టణంలో సోమవారం ‘‘నోమాస్క్‌-నోఎంట్రీ’’ అనే అంశంమీద వైద్య సిబ్బంది ర్యాలీ నిర్వహించారు.

మాస్క్‌లతోనే కరోనా దూరం
మాస్క్‌లు ధరించాలని ర్యాలీ నిర్వహిస్తున్న వైద్యులు, సిబ్బంది

నాయుడుపేట టౌన్‌, జూలై 12 : ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించడం ద్వారానే కరోనాకు దూరంగా ఉండవచ్చని వైద్యురాలు నిత్య ప్రశాంతి అన్నారు. పట్టణంలో సోమవారం ‘‘నోమాస్క్‌-నోఎంట్రీ’’ అనే అంశంమీద వైద్య సిబ్బంది ర్యాలీ నిర్వహించారు.  అనంతరం ప్రఽధాన కూడలి ప్రాంతాల వద్ద,  బ్యాంకులు, పోస్టల్‌ కార్యాలయం వద్ద అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నిత్య ప్రశాంతి మాట్లాడుతూ మాస్క్‌ ధరించడం, చేతులను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవడం, సామాజికదూరం పాటించడం ద్వారా కరోనా దరిచేరదన్నారు. కార్యక్రమంలో సూపర్‌ వైజర్‌ మేరీ సుకన్య, వైద్య సిబ్బంది,  ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-13T04:12:43+05:30 IST