అనుమతి లేకుండా మరుగుదొడ్ల కూల్చివేత

ABN , First Publish Date - 2021-11-24T05:00:01+05:30 IST

మండలంలోని పెద్దపాళెం ఎంపీపీ పాఠశాలలో ఉన్న మరుగుదొడ్లను కూల్చివేయడాన్ని యూటీఎఫ్‌ మండల నాయకులు ఖండిం చారు.

అనుమతి లేకుండా మరుగుదొడ్ల కూల్చివేత

సూళ్లూరుపేట, నవంబరు 23 : మండలంలోని పెద్దపాళెం ఎంపీపీ పాఠశాలలో  ఉన్న మరుగుదొడ్లను కూల్చివేయడాన్ని యూటీఎఫ్‌ మండల నాయకులు ఖండిం చారు. అధికారుల నుంచి ఎటువంటి అనుమతులు లేకుండానే మన్నారుపోలూరు గ్రామానికి చెందిన గోగులతిరుపాల్‌, మరో ఇద్దరు, పాఠశాల ప్రధానోపాధ్యా యుడుతోపాటు  సోమవారం కూల్చివేశారని వారు తెలిపారు. ఇప్పటికే ఎంపీడీవో, ఎంపీపీ, తహసీల్దారు, మున్సిపల్‌ కమిషనర్‌, చైర్మన్‌లకు వినతిపత్రాలు సమర్పించామని, మరుగుదొడ్లు తిరిగి నిర్మించేందుకు ఏర్పాట్లు చేయాలని కోరారు. కార్యక్రమంలో యూటీఎఫ్‌ జిల్లా కుటుంబసంక్షేమ పథకం ఉపాఽధ్యక్షుడు ప్రభాకర్‌, నాయకులు శ్రీనివాసులు, వెంకటస్వామి, సుబ్రహ్మణ్యం, భాస్కర్‌,  ఉన్నారు.

Updated Date - 2021-11-24T05:00:01+05:30 IST