జనవరి ఆఖరుకు రీసర్వేను పూర్తిచేయాలి

ABN , First Publish Date - 2021-12-20T03:27:10+05:30 IST

జనవరి నెలాఖరుకు భూమి రీ సర్వేను పూర్తిచేయాలని రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వర్లు, ఏడీ హనుమాన్‌ప్రసాద్‌ కోరారు.

జనవరి ఆఖరుకు రీసర్వేను పూర్తిచేయాలి

గూడూరు, డిసెంబరు 19: జనవరి నెలాఖరుకు భూమి రీ సర్వేను పూర్తిచేయాలని రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వర్లు, ఏడీ హనుమాన్‌ప్రసాద్‌ కోరారు. ఆదివారం స్థానిక డీఎన్‌ఆర్‌ కమ్యూనిటీ హాలులో జిల్లాలోని అన్ని మండలాల, విలేజ్‌ సర్వేయర్లతో  సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రీ సర్వేతో భూ సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. భూ యజమానులు సర్వేయర్లకు సహకరించాల న్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వే అల్తాఫ్‌, సర్వే సంఘం జిల్లా అధ్యక్షుడు రామ్‌కుమార్‌, సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-20T03:27:10+05:30 IST