ముగిసిన భాషోత్సవాలు

ABN , First Publish Date - 2021-12-31T05:02:54+05:30 IST

మండలంలోని ప్రభుత్వ పాఠశా లల్లో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న భాషోత్సవాలు గురువార ంతో ముగిశాయి.

ముగిసిన భాషోత్సవాలు
సాంప్రదాయ, సంస్కృతులు, దేశభక్తి వేషధారణలో విద్యార్ధులు

ఉదయగిరి రూరల్‌, డిసెంబరు 30: మండలంలోని ప్రభుత్వ పాఠశా లల్లో  నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న భాషోత్సవాలు గురువార ంతో ముగిశాయి.  స్థానిక దళితవాడ ప్రాథమిక, బిజ్జంపల్లి, వెంగళ రావునగర్‌, అప్పసముద్రం తదితర జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల్లో తెలుగు భాషోత్సవాలను వైభవంగా నిర్వహించారు. బిజ్జంపల్లి ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయురాయులు కిన్నెర వాణి వేసిన రంగువల్లులు పలువుర్ని అకట్టుకున్నాయి. విద్యార్థులకు పలు పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు.  హెచ్‌ఎం సయ్యద్‌ కలీం, వెంకటేశ్వర్లు, ముంజీరాఅహ్మద్‌, ఉపాధ్యాయులు పాల్గొ న్నారు. 

అనంతసాగరం : మండలంలోని పలు పాఠశాలల్లో తెలుగుదనం ఉట్టిపడేలా విద్యార్థులు చేసిన కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకు న్నాయి. వెంగంపల్లి, రేవూరు, అనంతసాగరం, కచ్చేరిదేవరాయపల్లి గ్రామాల్లోని పాఠశాలల్లో కార్యక్రమాలు నిర్వహించారు. ఉపాధ్యాయలు ఆచారాలు, పండుగలు, సాంప్రదాయాలను విద్యార్థులకు వివరించారు. వారికి బహుమ తులు అందించారు.

మర్రిపాడు :  మండలంలో పలు పాఠశాలల్లో మూడో రోజు గురువారం భాషోత్సవాలు ముగిశాయి. స్థానిక జిల్లా ప్రజా పరిషత్‌ ఉన్నతపాఠశాలలో విద్యార్థులు దేశభక్తి గీతాలు పాడారు. గిడుగు వెంకటరామమూర్తి, అల్లూరి సీతారామరాజు, రుద్రమ్మదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి వేషధారణలతో చక్కగా నృత్యాలు ప్రదర్శించారు. ప్రధాన్యోపాధ్యాయురాలు జివజ్యోతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 

ఏ ఎస్‌ పేట : భాషోత్సవాల్లో  భాగంగా ఏ ఎస్‌ పేట హైస్కూ ల్‌లో విద్యార్థులు గాంధీ, భగత్‌సింగ్‌, నెహ్రు, సాం ప్రదాయ, ఆదివాసి, డాక్టర్‌, లాయర్‌ తదితర వేషధారణలో అలరించారు.  విద్యార్థులకు ఆదిమానవుల నుంచి ఆధునిక యుగం వరకు సాంప్రదాయ, సంస్కృతులు, దేశభక్తిపై వ్యాస,చిత్ర లేఖన పోలీలు నిర్వహించి బహుమతులు అందించారు. 

సంగం :  మండలంలోని తరుణవాయి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో గురువారం విద్యార్థులు భాషోపాధ్యాయుల వేషధారణలో ఆకట్టుకున్నారు. ఇంగ్లీషుతోపాటు తెలుగుకు సమాన ప్రాధాన్యం ఇస్తామని ప్రతిజ్ఞ చేశారు.  కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-31T05:02:54+05:30 IST