వరద బాధితులకు ఆర్థిక సహాయం వేగం : మేయర్‌

ABN , First Publish Date - 2021-11-28T05:37:40+05:30 IST

వరదలకు దెబ్బతిన్న కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అందించే ఆర్థిక సహాయం మరింత వేగవంతం చేయాలని నగర మేయర్‌ పొట్లూరి స్రవంతి సూచించారు.

వరద బాధితులకు ఆర్థిక సహాయం వేగం : మేయర్‌
రెవెన్యూ అధికారులతో మాట్లాడుతున్న మేయర్‌ స్రవంతి

నెల్లూరు(సిటీ), నవంబరు 27 : వరదలకు దెబ్బతిన్న కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అందించే ఆర్థిక సహాయం మరింత వేగవంతం చేయాలని నగర మేయర్‌ పొట్లూరి స్రవంతి సూచించారు. శనివారం కార్పొరేషన్‌ కార్యాలయంలోని తన చాంబరులో డీసీ చంద్రుడు, ఆర్వోలు, ఆర్‌ఐలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వరద బాధితులకు ప్రభుత్వం రూ. 2 వేలు తక్షణ సహాయం అందించిందన్నారు. ఆ సాయం వీలైనంత త్వరగా బాధితులకు చేర్చాలన్నారు. క్షేత్ర స్థాయిలో సిబ్బందిని అప్రమత్తం చేసి బాధిత కుటుంబాల వద్దకు పంపాలని ఆదేశించారు. ముందుగా మెప్మా పీడీ రవీంద్ర ఆధ్వర్యంలో పొదుపు మహిళలు మేయర్‌ స్రవంతిని ఘనంగా సత్కరించారు. మహిళ  మేయర్‌గా ఎన్నిక కావడంపై  హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - 2021-11-28T05:37:40+05:30 IST