మండల అభివృద్దికి సమష్టి కృషి

ABN , First Publish Date - 2021-10-26T03:42:19+05:30 IST

సమష్టిగా కృషిచేసి డక్కిలి మండలాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిద్దామని జడ్పీటీసీ సభ్యురాలు కలిమలి రాజ్యలక్ష్మి ప్రజా ప్రతినిధులు, అధికారులకు పిలుపునిచ్చారు.

మండల అభివృద్దికి సమష్టి కృషి
సమావేశంలో మాట్లాడుతున్న జడ్పీటీసీ కలిమలి రాజ్యలక్ష్మి

డక్కిలి, అక్టోబరు 25 : సమష్టిగా కృషిచేసి డక్కిలి మండలాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిద్దామని జడ్పీటీసీ సభ్యురాలు కలిమలి రాజ్యలక్ష్మి  ప్రజా ప్రతినిధులు, అధికారులకు పిలుపునిచ్చారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో సోమవారం పంచాయతీ వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పంచాయతీల అభివృద్దిలో వార్డు సభ్యులు పాలుపంచుకోవాలన్నారు.  ఎంపీపీ గోను రాజశేఖర్‌ మాట్లాడుతూ సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి చేరేలా చూస్తామన్నారు. ఎంపీడీవో వసుంధర, అప్పాజీ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-26T03:42:19+05:30 IST