సివిల్‌ సర్సీసు ఉద్యోగుల క్రీడా ఎంపికలు

ABN , First Publish Date - 2021-09-04T05:03:39+05:30 IST

నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం లో సివిల్‌ సర్వీసు ఉద్యోగుల క్రీడా ఎంపికలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను సెట్నల్‌ సీఈవో డీ పుల్లయ్య ప్రారంభించారు.

సివిల్‌ సర్సీసు ఉద్యోగుల క్రీడా ఎంపికలు
చెస్‌ పోటీల్లో సివిల్‌ సర్వీసు ఉద్యోగులు

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), సెప్టెంబరు 3: నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం లో సివిల్‌ సర్వీసు ఉద్యోగుల క్రీడా ఎంపికలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను సెట్నల్‌ సీఈవో డీ పుల్లయ్య ప్రారంభించారు. తొలి రోజు సివిల్‌ సర్వీసు ఉద్యోగులు బాడ్మింటన్‌, బాస్కెట్‌బాల్‌, క్యారమ్స్‌, చెస్‌, క్రికెట్‌, ఫుట్‌బాల్‌ తదితర క్రీడల్లో పోటాపోటీగా పాల్గొన్నారు. శనివారం పలు క్రీడా విభాగాల్లో పోటీలు నిర్వహిస్తామని, ప్రతిభ చూపిన క్రీడాకారులు ఈ నెల 6వ తేదీ నుంచి 9వ తేదీ వరకు విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పుల్లయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో చీఫ్‌ కోచ్‌ ఆర్‌కే యతిరాజ్‌, శిక్షకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-04T05:03:39+05:30 IST