పెట్రో ధరల పెంపును నిరసిస్తూ రాస్తారోకో

ABN , First Publish Date - 2021-02-27T04:05:26+05:30 IST

పెట్రో ధరల పెంపును నిరసిస్తూ శుక్రవారం భారత్‌ బంద్‌లో భాగంగా స్థానికంగా సీఐటీయూ, దాని అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో చేశారు.

పెట్రో ధరల పెంపును నిరసిస్తూ రాస్తారోకో
సూళ్లూరుపేట జాతీయ రహదారిపై ఆందోళన చేస్తున్న సీఐటీయూ నేతలు

 సూళ్లూరుపేట, ఫిబ్రవరి 26 : పెట్రో ధరల పెంపును నిరసిస్తూ శుక్రవారం భారత్‌ బంద్‌లో భాగంగా స్థానికంగా సీఐటీయూ, దాని అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో చేశారు. హోలీక్రాస్‌ సర్కిల్‌ వద్ద జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. పోలీసులు ఆందోళన కారులకు నచ్చచెప్పి ఆందోళనను విరమింపజేశారు. అనంతరం పెట్రోల్‌ బంకు వద్ద నినాదాలు చేశారు. కేరళ తరహాలో రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించాలని, వాటిని జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావాలని సీఐటీయూ నేత పద్మనాభయ్య డిమాండ్‌ చేశారు.  కార్యక్రమంలో నాయకులు సుధాకర్‌రావు, సాంబశివయ్య, అల్లెయ్య పాల్గొన్నారు.

Updated Date - 2021-02-27T04:05:26+05:30 IST