సినీ సీనియర్‌ పబ్లిసిటీ డిజైనర్‌ వెంకటేశ్వరరావు మృతి

ABN , First Publish Date - 2021-05-22T04:41:09+05:30 IST

సినీ సీనియర్‌ పబ్లిసిటీ డిజైనర్‌ పబ్బా వెంకటేశ్వరరావు (80) చెన్నైలో గురువారం రాత్రి మృతి చెందారు.

సినీ సీనియర్‌ పబ్లిసిటీ డిజైనర్‌ వెంకటేశ్వరరావు మృతి

నెల్లూరు(సాంస్కృతిక, ప్రతినిధి), మే 21 : సినీ సీనియర్‌ పబ్లిసిటీ డిజైనర్‌ పబ్బా వెంకటేశ్వరరావు (80) చెన్నైలో గురువారం రాత్రి మృతి చెందారు. నగరంలోని రంగనాయకుల పేటకు చెందిన ఆయన మద్రాసు ఆర్ట్స్‌ కళాశాలలో తొలి బ్యాచ్‌ ఫైన్‌ ఆర్ట్‌ చేశారు. వివిధ రంగాల్లో పనిచేస్తూ సినీ పరిశ్రమలో స్థిపరడ్డారు. బాపు, విఠలాచార్య, పంజుల నాగేశ్వరరావు సంస్థలకు పర్మినెంట్‌ డిజైనర్‌గా పనిచేశారు. సీతాకల్యాణం, పిల్లా పిడుగా, మాయమచ్చీంద్ర, జగన్మాత, జగన్మోహినీ, నవమోహినీ, గాంధర్వకన్య లాంటి 200 సినమాలకు పైగా పనిచేశారు. యూరో సమస్యతో చెన్నైలో మృతిచెందారు.  ఆయనకు ఇద్దరు పిల్లలు. వారు వివిధ రంగాలలో స్థిరపడ్డారు.

Updated Date - 2021-05-22T04:41:09+05:30 IST