చోరీ కేసులో నిందితుడి అరెస్ట్‌

ABN , First Publish Date - 2021-08-21T04:55:51+05:30 IST

కావలి పట్టణంలో తాళం వేసిన ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న ఆవుల వెంకట సుబ్బయ్యను శుక్రవారం సాయంత్రం రెండో పట్టణ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

చోరీ కేసులో నిందితుడి అరెస్ట్‌
నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న ఆభరణాలతో సీఐ, ఎస్‌ఐలు

రూ.3 లక్షల విలువైన ఆభరణాల స్వాధీనం

కావలి రూరల్‌, ఆగస్టు 20: కావలి పట్టణంలో తాళం వేసిన ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న ఆవుల వెంకట సుబ్బయ్యను శుక్రవారం సాయంత్రం రెండో పట్టణ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతని నుంచి రూ.3 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సీఐ మల్లికార్జునరావు వివరించారు. పట్టణంలోని ఇందిరానగర్‌లో తాళం వేసి ఉన్న దార్ల పద్మావతి ఇంట్లో చోరీ జరగడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో డీఎస్పీ ప్రసాద్‌, సీఐ మల్లికార్జునరావు పర్యవేక్షణలో ఎస్‌ఐ ప్రవీణ పట్టణంలోని బంగారు దుకాణాల్లో నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో బాలక్రిష్ణారెడ్డి నగర్‌కు చెందిన ఆవుల వెంకట సుబ్బయ్య చోరీ సొత్తు విక్రయానికి తీసుకువచ్చినట్లు సమాచారం అందడంతో అతనిని అదుపులోకి తీసుకున్నారు. బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఇతను పట్టణంలోని వెంగళరావునగర్‌, ఇందిరానగర్‌, కచ్చేరిమిట్ల ప్రాంతాల్లో తాళం వేసిన ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ప్రవీణ తెలిపారు.

Updated Date - 2021-08-21T04:55:51+05:30 IST