వైభవంగా క్రిస్మస్‌

ABN , First Publish Date - 2021-12-26T04:07:34+05:30 IST

నగరంలో క్రిస్మస్‌ పండుగను క్రైస్తవులు సంబరంగా జరుపుకున్నారు. చర్చిలు, ప్రార్థనా మందిరాలు భక్తులతో కిటకిటలాడాయి.

వైభవంగా క్రిస్మస్‌
బిషప్‌ చర్చిలో బాలయేసు జననం సెట్టింగ్‌

నగరంలో క్రిస్మస్‌ పండుగను క్రైస్తవులు సంబరంగా జరుపుకున్నారు. చర్చిలు, ప్రార్థనా మందిరాలు భక్తులతో కిటకిటలాడాయి. ప్రతిచోట ప్రత్యేక ప్రార్థనలు, వేడుకలు నిర్వహించారు. కపాడిపాళెంలో క్రిస్మస్‌ పండుగ సెట్టింగ్‌ ఆకట్టుకుంది. వెంగళరావు నగర్‌ సెంటర్‌లో మాజీ కార్పొరేటర్‌ డాక్టర్‌ స్వర్ణా వెంకయ్య ఆధ్వర్యంలో క్రిస్మస్‌ వేడుకలు జరిగాయి. సువార్త కూటములు, భక్తిగీతాలాపన జరిగాయి. అన్నదానం, దుప్పట్ల పంపిణీ కార్యక్రమాలు జరిగాయి. మేయర్‌ స్రవంతి, రూరల్‌ ఎమ్మెల్యే కార్యాలయ ఇన్‌చార్జి గిరిధర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్‌ ప్రాంతంలోని నారాయణరెడ్డిపేటలో రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ డైరెక్టర్‌ షేక్‌ కరిముల్లా క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. మతాలు ఏవైనా ప్రజలంతా ఒక్కటేనన్నారు. ఈ కార్యక్రమం లో స్థానిక కార్పొరేటర్‌ జానా నాగరాజు పాల్గొన్నారు. 2వ డివిజన్‌లో జరిగిన వేడుకల్లో కార్పొరేటర్‌ పడిగినేటి రామ్మోహన్‌ పాల్గొన్నారు. చింతారెడ్డిపాళెం చర్చివద్ద భారీ అన్నదానం, దుప్పట్లు, నిత్యావసర సరుకుల పంపిణీ జరిగింది. 

- నెల్లూరు సిటీ/సాంస్కృతికం

Updated Date - 2021-12-26T04:07:34+05:30 IST