చెరకు రైతుల బకాయిలు త్వరగా చెల్లించాలి
ABN , First Publish Date - 2021-11-06T05:17:39+05:30 IST
పొదలకూరు చక్కెర కర్మాగారం నుంచి రైతులకు చెల్లించాల్సిన బకాయిలను త్వరగా చెల్లించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చక్రధర్‌బాబు అధికారులను ఆదేశించారు.

అధికారుల సమీక్షలో కలెక్టర్
నెల్లూరు(హరనాథపురం), నవంబరు 5 : పొదలకూరు చక్కెర కర్మాగారం నుంచి రైతులకు చెల్లించాల్సిన బకాయిలను త్వరగా చెల్లించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చక్రధర్‌బాబు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం కలెక్టరేట్‌లో చెరకు రైతుల బకాయిలపై సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2018-19 సంవత్సరానికిగాను 774మంది రైతులకు చెల్లించాల్సిన రూ.24కోట్ల రూపాయల్లో రూ.14కోట్లు చెల్లించారన్నారు. ఇంకా రైతులకు సుమారు రూ.10 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ బకాయిల చెల్లింపులకు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జేసీ హరేందిరప్రసాద్, ట్రైనీ కలెక్టర్ పఠాన్ అహ్మద్‌ఖాన్, తదితరులు పాల్గొన్నారు.