చెంగాళమ్మ సేవలో ఎంపీ వేమిరెడ్డి

ABN , First Publish Date - 2021-01-14T04:32:47+05:30 IST

సూళ్లూరుపేట చెంగాళమ్మ తల్లిని బుధవారం రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తన సతీమణి ప్రశాంతితో కలసి దర్శించుకున్నారు.

చెంగాళమ్మ సేవలో ఎంపీ వేమిరెడ్డి
చెంగాళమ్మ ఆలయంలో ఎంపీ వేమిరెడ్డి దంపతులు

సూళ్లూరుపేట, జనవరి 13 : సూళ్లూరుపేట చెంగాళమ్మ తల్లిని బుధవారం రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తన సతీమణి ప్రశాంతితో కలసి దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన వీరికి  చైర్మన్‌ దువ్వూరు బాలచంద్రారెడ్డి, ఈవో ఆళ్ల శ్రీనివాసరెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతించారు. దర్శనానంతరం వేదపండితులచే ఆశీర్వచనం చేయించి అమ్మణ్ణి ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీకి చెందిన కళత్తూరు శేఖర్‌రెడ్డి, దబ్బల శ్రీమంత్‌రెడ్డి, అల్లూరు అనిల్‌రెడ్డి, ట్రస్టుబోర్డు సభ్యులు గోగుల తిరుపాల్‌, ముంగర అమరావతి పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-14T04:32:47+05:30 IST