మండలస్థాయి చెకుముకి పోటీలు

ABN , First Publish Date - 2021-11-27T02:56:48+05:30 IST

సూళ్లూరుపేట జడ్పీ బాలికోన్నత పాఠశాలలో శుక్రవారం మండలస్థాయి చెకుముకి టాలెంట్‌ టెస్టు నిర్వహించారు.

మండలస్థాయి చెకుముకి పోటీలు
బహుమతులు అందజేస్తున్న బాలికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయిని

సూళ్లూరుపేట, నవంబరు 26 : సూళ్లూరుపేట జడ్పీ బాలికోన్నత పాఠశాలలో శుక్రవారం మండలస్థాయి చెకుముకి టాలెంట్‌ టెస్టు నిర్వహించారు. తడ,  సూళ్లూరుపేట, దొరవారిసత్రం మండలాల విద్యార్థులకు ఈ పోటీలు నిర్వహించారు. మండలస్థాయిలో మంగళంపాడు ఉన్నత పాఠశాల విద్యార్థులు వర్షిణి,  వాణి, అజయ్‌, దినేష్‌, పూజిత, త్రిష గెలుపొందారు. దొరవారిసత్రం మండలంలో గురుకుల పాఠశాలకు చెందిన గణేష్‌, యశ్వంత్‌, రాకేష్‌వర్మ, శ్రీధనమల్లి ఉన్నత పాఠశాలకు చెందిన సుమాంజలి, అజిత్‌, స్పందన, తడ మండలంలో అక్కంపేట మోడల్‌ స్కూల్‌ విద్యార్థులు చరణ్‌, హరిణి, నోరాహత్‌రిదా, వాటంబేడు ఉన్నత పాఠశాలకు చెందిన కీర్తన, శైలజ, ఫాతిమా విజేతలయ్యారు. వీరందరూ జిల్లా స్థాయి పోటీలకు హాజరవుతారని జన విజ్ఞానవేదిక జిల్లా ఆధ్యక్షుడు చెంగయ్య, జిల్లా కార్యదర్శి వెంకటరమణ తెలిపారు. గెలుపొందిన విద్యార్థులకు సూళ్లూరుపేట బాలికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయిని ధనలక్ష్మి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జవివేకు చెందిన రాజేష్‌బాబు, రామమూర్తి, మస్తాన్‌, భాస్కర్‌, ఉపాధ్యాయిని రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. 

నాయుడుపేట : మండలస్థాయి చెకుముకి టాలెంట్‌ టెస్టు విజేతలకు పట్టణంలోని జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో బహుమతులు పంపిణీ చేశారు. ఎంఈవో బాబు, ప్రధానోపాధ్యాయులు దొరస్వామి, సుబ్రహ్మణ్యం, జనవిజ్ఞాన వేదిక అధ్యక్షుడు చెంగయ్య, నాయకులు కుమార్‌, ప్రసాద్‌, షఫీఉల్లా, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 

గూడూరు: స్థానిక జడ్పీ బాలుర ఉన్నతపాఠశాలలో మండలస్థాయి చెకుముకి పోటీ లు నిర్వహించారు. కార్యక్రమంలో జేవీవీ పట్టణ అధ్యక్షుడు వేగూరు రాజేంద్రప్రసాద్‌,హెచ్‌ఎం రపూఫ్‌, నాగరాజు, చెంచునారాయణ, పురుషోత్తమరావు, మస్తానయ్య తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-11-27T02:56:48+05:30 IST