చెల్లని చెక్కు కేసులో నిందితుడికి రెండేళ్ల జైలు
ABN , First Publish Date - 2021-02-26T05:36:17+05:30 IST
చెల్లని చెక్కు ఇచ్చిన కేసులో నిందితుడికి రెండేళ్ల జైలుశిక్ష విధిస్తూ స్పెషల్ కోర్టు మేజిస్ట్రేట్ యూసఫ్ గురువారం తీర్పు చెప్పారు.

కోవూరు, ఫిబ్రవరి 25: చెల్లని చెక్కు ఇచ్చిన కేసులో నిందితుడికి రెండేళ్ల జైలుశిక్ష విధిస్తూ స్పెషల్ కోర్టు మేజిస్ట్రేట్ యూసఫ్ గురువారం తీర్పు చెప్పారు. అల్లూరు మండలంలోని అల్లూరుపేట గ్రామానికి చెందిన యరటపల్లి వెంకట రమణారెడ్డికి నెల్లూరు నగరంలోని డైకస్ రోడ్డుకు చెందిన మలిరెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి బాకీ చెల్లింపు నిమిత్తం రూ. 12,31,000కు చెక్కు ఇచ్చాడు. ఆ చెక్కును వెంకట రమణారెడ్డి బ్యాంకులో వేయగా అక్కౌంటులో డబ్చులు లేకపోవడంతో చెక్కు చెల్లలేదు. దీంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. నేరం రుజువు కావడంతో రూ. 17లక్షలు ఫిర్యాదీదారుడికి చెల్లించాల్సిందిగా, రూ. 5000లు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. అయితే నిందితుడు నగదు చెల్లించకపోవడంతో రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. అనంతరం రవీంద్రనాథ్‌రెడ్డిని జిల్లా జైలుకు పంపారు.