చెంగాళమ్మకు చండీయాగం

ABN , First Publish Date - 2021-10-21T03:29:39+05:30 IST

సూళ్లూరుపేట చెంగాళమ్మ ఆలయంలో పౌర్ణమి సందర్భంగా బుధవారం చండీయాగం నిర్వహించారు. ఆలయ ఆవరణం

చెంగాళమ్మకు చండీయాగం
చెంగాళమ్మ ఆలయంలో జరుగుతున్న చండీయాగంలో పూర్ణాహుతి సమర్పిస్తున్న ఉభయకర్తలు

సూళ్లూరుపేట, అక్టోబరు 20 :  సూళ్లూరుపేట చెంగాళమ్మ ఆలయంలో పౌర్ణమి సందర్భంగా బుధవారం చండీయాగం నిర్వహించారు. ఆలయ ఆవరణంలోని యాగశాలవద్ద అమ్మణ్ణి ఉత్సవమూర్తిని ప్రతిష్ఠించి గోపూజ నిర్వహించారు. అనంతరం వేదపండితులు చండీయాగం నిర్వహించారు.  నెల్లూరుకు చెందిన డాక్టర్‌ వేణుంబాక రమణారెడ్డి దంపతులు ఉభయకర్తలుగా పాల్గొన్నారు. ఆలయ ఈవో ఆళ్ల శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో చండీయాగం జరిగింది. 


Updated Date - 2021-10-21T03:29:39+05:30 IST