చంద్రబాబు దీక్షకు తరలిన తెలుగు తమ్ముళ్లు
ABN , First Publish Date - 2021-10-22T04:21:57+05:30 IST
ప్రభుత్వ ఉద్రవాదంపై పోరులో భాగంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు చేపట్టిన 36గంటల నిరసన దీక్షలో గురువారం మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డితో కలిసి పొదలకూరు మండల నేతలు సంఘీభావం తెల్పడానికి తరలివెళ్లారు.

పొదలకూరు, అక్టోబరు 21 : ప్రభుత్వ ఉద్రవాదంపై పోరులో భాగంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు చేపట్టిన 36గంటల నిరసన దీక్షలో గురువారం మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డితో కలిసి పొదలకూరు మండల నేతలు సంఘీభావం తెల్పడానికి తరలివెళ్లారు. ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షుడు తలచీరు మస్తాన్‌బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని.. పార్టీ కార్యాలయాలు, నాయకులను టార్గెట్ చేసుకుని పోలీసుల సహకారంతో వైసీపీ గూండాలు దాడులు చేయడం హేయమైన చర్య అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసాలు, అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే వైసీపీకి తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు ఆర్గనైజింగ్ కార్యదర్శి కోడూరు పెంచల భాస్కరరెడ్డి, తెలుగు యువత మండల అధ్యక్షుడు వెన్నపూస రాజశేఖర్‌రెడ్డి, నాయకులు అక్కెం సుధాకర్‌రెడ్డి, యత్తపు వెంకటరెడ్డి పాల్గొన్నారు.
వెంకటాచలం : టీడీపీ కార్యాలయాలు, నాయకుల ఇళ్లపై దాడులకు నిరసనగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 36 గంటల పాటు మంగళగిరిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిరసన దీక్షకు దిగారు. ఈ సందర్భంగా చంద్రబాబు గురువారం నుంచి శుక్రవారం రాత్రి వరకు చేపట్టిన దీక్షకు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పిలుపు మేరకు వెంకటాచలం టీడీపీ మండల నాయకులు, కార్యకర్తలు భారీగా ప్రత్యేక వాహనాల్లో తరలివెళ్లి చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో గుమ్మడి రాజాయాదవ్, కుంకాల దశరథ నాగేంద్రప్రసాద్, కోదండయ్యనాయుడు, మావిళ్లపల్లి శ్రీనివాసులునాయుడు, రావూరి రాధాకృష్ణమనాయుడు, ధనుంజయ్యనాయుడు, వల్లూరు రమేష్‌నాయుడు, చల్లా నాగార్జున్‌రెడ్డి, కందిమళ్ల సతీష్‌నాయుడు, పఠాన్ ఖాయ్యుమ్ ఖాన్, నిక్కుదల రమేష్ తదితరులున్నారు.