చెంగాళమ్మ ఆలయంలో చండీయాగం
ABN , First Publish Date - 2021-07-25T04:02:55+05:30 IST
ఆషాఢ గురుపౌర్ణమి సందర్భంగా సూళ్లూరుపేట చెంగాళమ్మ ఆలయంలో శనివారం చండీయాగం వైభవంగా నిర్వహించారు.

సూళ్లూరుపేట, జూలై 24 : ఆషాఢ గురుపౌర్ణమి సందర్భంగా సూళ్లూరుపేట చెంగాళమ్మ ఆలయంలో శనివారం చండీయాగం వైభవంగా నిర్వహించారు. ఆలయ ఆవరణలోని యాగశాలలో అమ్మణ్ణి ఉత్సవమూర్తిని ప్రతిష్ఠించి కలశస్థాపనల అనంతరం వేదమంత్రాలతో చండీయాగం జరిపించారు. ప్రముఖ కాంట్రాక్టర్ కొండేపాటి గంగాప్రసాద్ - కోమలి దంపతులు ఉభయకర్తలుగా పాల్గొన్నారు. ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి, ఈవో ఆళ్ల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పెంచలకోన ఆలయ మాజీ చైర్మన్ తానంకి నానాజీ, కళత్తూరు రామమోహన్‌రెడ్డి, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.