మజ్జిగ చలివేంద్రం ప్రారంభం
ABN , First Publish Date - 2021-04-05T04:52:50+05:30 IST
పట్టణంలోని వాసవీ వనితా క్లబ్ ఆధ్వర్యంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు అమరా బ్రదర్స్ వద్ద మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
పొదలకూరు, ఏప్రిల్ 4: పట్టణంలోని వాసవీ వనితా క్లబ్ ఆధ్వర్యంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు అమరా బ్రదర్స్ వద్ద మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆదివారం స్థానిక సీఐ గంగాధరరావు చలివేంద్రాన్ని ప్రారంభించి, అనంతరం మాట్లాడుతూ ఎండలు ఎక్కువగా ఉన్న ఈ వేసవిలో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం శుభపరిణామన్నారు. ఈ క్రమంలో వాసవీక్లబ్ వారిని అభినందించారు. వాసవీ వనిత క్లబ్ అధ్యక్షురాలు అమరా వెంకట సుప్రజ మాట్లాడుతూ పట్టణానికి వచ్చే రైతులు, విద్యార్థులు, సామాన్య ప్రజలు తాగునీటి కోసం పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఏడాది చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో వనిత క్లబ్ సభ్యులు తన్నీరు భారతి, నున్నా విజయలక్ష్మి, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.