తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి

ABN , First Publish Date - 2021-10-15T03:11:24+05:30 IST

ఆలయాలు, దర్గాలు, చర్చిల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సీఐ గిరిబాబు తెలిపారు. గురువారం స్థా

తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి
: సమావేశంలో మాట్లాడుతున్న సీఐ గిరిబాబు

ఉదయగిరి రూరల్‌, అక్టోబరు 14: ఆలయాలు, దర్గాలు, చర్చిల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సీఐ గిరిబాబు తెలిపారు. గురువారం స్థానిక సర్కిల్‌ కార్యాలయ ఆవరణలో దుత్తలూరు, ఉదయగిరి మండలాలకు చెందిన ఆలయాలు, దర్గాలు, చర్చిల కమిటీ నిర్వాహకులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల ఆయా ప్రార్థనా మందిరాల్లో చోరీలు జరుగుతున్నాయని, కమిటీ సభ్యులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆలయాల్లో విలువైన సామగ్రిని బ్యాంకు లాకర్లు, నిర్వాహకుల నివాసాల్లో ఉంచుకోవాలన్నారు. వారానికోసారి హుండీల నగదు లెక్కించాలన్నారు. దాతలు లేదా కమిటీ సభ్యుల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని చోరీలను నివారించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు అంకమ్మ, లతీపున్నీసా, బాజిరెడ్డి, కమిటీ సభ్యులు తదితరులు 


Updated Date - 2021-10-15T03:11:24+05:30 IST