ఇసుక టిప్పర్లపై కేసుల నమోదు

ABN , First Publish Date - 2021-12-20T04:16:10+05:30 IST

శుక్రవారం పట్టుబడ్డ ఇసుక టిప్పర్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

ఇసుక టిప్పర్లపై కేసుల నమోదు

తడ, డిసెంబరు 19 :  శుక్రవారం పట్టుబడ్డ ఇసుక టిప్పర్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పెద్దపన్నంగాడు వద్ద స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో విజిలెన్స్‌ అధికారులు అనుమతి తీసుకున్న ప్రాంతం దాటి వెళ్తున్న 3 ఇసుక టిప్పర్లను పట్టుకున్న విషయం విదితమే. వాటిని ఆదివారం తడ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువచ్చి పోలీసులకు స్వాధీనం చేశారు. దాంతో టిప్పర్‌ డ్రైవర్లు, యజమానులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

Updated Date - 2021-12-20T04:16:10+05:30 IST