ఇరువర్గాల ఘర్షణ : నలుగురికి గాయాలు

ABN , First Publish Date - 2021-12-29T03:49:47+05:30 IST

మండలంలోని బ్రాహ్మణక్రాక పంచాయతీ తొమ్మిదోమైలు ఎస్సీ కాలనీలో సోమవారం రాత్రి ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో నలుగురుకి గాయాలయ్యాయి.

ఇరువర్గాల ఘర్షణ : నలుగురికి గాయాలు
గాయపడ్డ గంగపట్ల మాలకొండయ్య, తదితరులు

జలదంకి, డిసెంబరు 28: మండలంలోని బ్రాహ్మణక్రాక పంచాయతీ తొమ్మిదోమైలు ఎస్సీ కాలనీలో సోమవారం రాత్రి ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో నలుగురుకి గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు... గ్రామంలో ఇరువర్గాల మధ్య కొంతకాలంగా వివాదాలు ఉన్నాయి. ఈ క్రమంలో మూడు రోజుల నుంచి వీరి మధ్య వాగ్వాదాలు జరుగుతున్నాయి. ఇది చినికిచినికి గాలివానలా మారి ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో ఇరువర్గాలు కర్రలతో దాడులకు పాల్పడ్డారు. ఈ ఘర్షణలో ఒక వర్గానికి చెందిన గంగపట్ల మాలకొండయ్య, సుబ్బారావు, సురేష్‌ గాయపడగా, మరో వర్గానికి చెందిన చెందిన గోచిపాతల హరి గాయపడ్డాడు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. ఇరువర్గాలు పరస్పరం  పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇరువర్గాలకు చెందిన 10 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వీరప్రతాప్‌ తెలిపారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పికెట్‌ ఏర్పాటు చేశారు.

Updated Date - 2021-12-29T03:49:47+05:30 IST