బ్రెయిన్, హార్ట్ స్ట్రోక్‌లను నిర్లక్ష్యం చేయొద్దు
ABN , First Publish Date - 2021-10-30T05:03:02+05:30 IST
బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ర్టోక్ విషయంలో నిర్లక్ష్యం వహించరాదని రెడ్‌క్రాస్ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ పక్షవాత నివారణ దినాన్ని శుక్రవారం రెడ్‌క్రాస్‌లో నిర్వహించారు.

రెడ్‌క్రాస్ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్
నెల్లూరు (వైద్యం), అక్టోబరు 29 : బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ర్టోక్ విషయంలో నిర్లక్ష్యం వహించరాదని రెడ్‌క్రాస్ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ పక్షవాత నివారణ దినాన్ని శుక్రవారం రెడ్‌క్రాస్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికవర్ ఆసుపత్రి వైద్యురాలు దిక్షాంతి నారాయణ్‌ను సన్మానించారు. చంద్ర శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ బ్రెయిన్‌స్ర్టోక్‌కు సకాలంలో తగిన చికిత్స చేయించుకోకపోతే పక్షవాతానికి గురికావలసి వస్తుందన్నారు. బ్రెయిన్‌స్ర్టోక్ ఎలా వస్తుందో దివ్యాంగ పిల్లలు, తల్లిదండ్రులకు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్ మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యులు దాసరి రాజేంద్రప్రసాద్, వైఆర్‌జీకేర్ కన్వీనర్ వేణుగోపాల్, తలసీమియా కో కన్వీనర్ పర్వీన్, ఏవో రఘకుమార్, సెక్రటరీ మస్తానయ్య, సీనియర్ స్టేట్ కో ఆర్డినేటర్ రవికుమార్, గాంధీ ఆశ్రమ కన్వీనర్ రవీంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, మెడికవర్ ఆసుపత్రిలో బ్రెయిన్ స్ర్టోక్‌పై అవగాహన కార్యక్రమం జరిగింది. డాక్టర్ దీక్షాంతి నారాయణ్, డాక్టర్ వేణుగోపాల్ మాట్లాడుతూ ఆధునాతన వైద్య విధానాలు అందుబాటులో ఉన్నందున స్ట్రోక్ వచ్చిన వెంటనే ఆసుపత్రికి తరలించడం ద్వారా బాధితుడిని కాపాడవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్యులు పాల్గొన్నారు.