బాలుడి అదృశ్యంపై ఫిర్యాదు

ABN , First Publish Date - 2021-10-21T03:31:56+05:30 IST

పిండిమర దగ్గరకు వెళ్లిన తమ కుమారుడు ఇంటికి తిరిగి రాలేదంటూ స్థానిక సొసైటీ ప్రాంతానికి చెందిన కట్టా రాజ్‌కుమార్‌ మంగళవారం రాత్రి ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బాలుడి అదృశ్యంపై ఫిర్యాదు
ద్వారకేష్‌

గూడూరు, అక్టోబరు 20: పిండిమర దగ్గరకు వెళ్లిన తమ కుమారుడు ఇంటికి తిరిగి రాలేదంటూ స్థానిక సొసైటీ ప్రాంతానికి చెందిన కట్టా రాజ్‌కుమార్‌  మంగళవారం రాత్రి ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజ్‌కుమార్‌ రెండో కుమారుడు ద్వారకేష్‌ పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. మంగళవారం సాయంత్రం 7.30 గంటలకు పిండి ఆడించుకుని వచ్చేందుకు సైకిల్‌పై తమ ఇంటికి  సమీపంలోని ఓ దుకాణం వద్ద వెళ్లాడు. గంటసేపు గడిచినా బాలుడు తిరిగి రాకపోవడంతో అతనిని తండ్రి వెళుతుండగా, అక్కడే ఉన్న పార్కు సమీపంలో ద్వారకేష్‌ సైకిల్‌, పిండిదబర కనిపించాయి. బాలుడి కోసం చుట్టుపక్కల వెతికినా అచూకీ లభించకపోవడంతో ఒకటో  పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 


Updated Date - 2021-10-21T03:31:56+05:30 IST