కార్యకర్తలను వేధించిన ఏ ఒక్కరినీ వదలిపెట్టం

ABN , First Publish Date - 2021-08-22T04:16:25+05:30 IST

టీడీపీ నాయకులను, కార్యకర్తలను వేధించిన ఏ ఒక్కరినీ వదలిపెట్టబోమని ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు అన్నారు. పార్టీని

కార్యకర్తలను వేధించిన ఏ ఒక్కరినీ వదలిపెట్టం

కొండాపురం, ఆగస్టు 21: టీడీపీ నాయకులను, కార్యకర్తలను వేధించిన ఏ ఒక్కరినీ వదలిపెట్టబోమని ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు అన్నారు. పార్టీని బలోపేతం చేసే దిశగా శనివారం మండల టీడీపీ కన్వీనర్‌ టి.లక్ష్మీనారాయణ అధ్యక్షతన కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. గతంలో పార్టీలతకతీతంగా పథ కాలు అందుతుంటే నేడు వైసీపీ వారికే చేరుతున్నాయన్నారు. మండలంలో తాను చేసిన అభివృద్ధే తప్ప మేకపాటి చేసింది శూన్యమన్నారు. ఈ సందర్భంగా తెలుగుయువత మండల అధ్యక్షుడుగా దాసరి అశోక్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు పమిడి రవికుమార్‌చౌదరి, టీడీపీ సీనియర్‌ నాయకుడు పోలినేని చినమాలకొండయ్య,  నెల్లూరు పార్లమెంటు అఽధికార ప్రతినిధి యారవ క్రిష్ణయ్య, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు కాకి ప్రసాద్‌, మాజీ జడ్పీటీసీ దామా మహేశ్వరారవు, జిల్లా మాజీ కార్యనిర్వాహక కార్యదర్శి సీహెచ్‌.వెంకటాద్రి, సీహెచ్‌ బాలకోటేశ్వరరావు, సీహెచ్‌.క్రిష్ణ, పీ.రమేష్‌, పీ.చంద్రబాబునాయుడు, నర్రా చెంచునాయుడు, మాచెర్ల పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-22T04:16:25+05:30 IST