పోలీసుల త్యాగాలు చిరస్మరణీయం

ABN , First Publish Date - 2021-10-30T03:28:50+05:30 IST

పోలీసుల త్యాగాలు చిరస్మరణీయమని కావలి ఆర్డీవో శీనానాయక్‌ పేర్కొన్నారు. పోలీస్‌ అమర వీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా రైల్వే పోలీస్‌ ఆధ్వర్యంలో శుక్రవారం రెడ్‌క్రాస్‌ రక్తనిధిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.

పోలీసుల త్యాగాలు చిరస్మరణీయం
రక్తదాతలకు సర్టిఫికెట్లు అందిస్తున్న ఆర్డీవో శీనానాయక్‌

ఆర్డీవో శీనానాయక్‌

కావలిటౌన్‌, అక్టోబరు 29: పోలీసుల త్యాగాలు చిరస్మరణీయమని కావలి ఆర్డీవో శీనానాయక్‌ పేర్కొన్నారు. పోలీస్‌ అమర వీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా రైల్వే పోలీస్‌ ఆధ్వర్యంలో శుక్రవారం రెడ్‌క్రాస్‌ రక్తనిధిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ టీ అరుణకుమారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిఽథిగా పాల్గొన్న ఆర్డీవో శిబిరాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రజల ప్రాణాలు కాపాడే క్రమంలో అనేక మంది పోలీసులు తమ ప్రాణాలు అర్పిస్తున్నారని, వారి సేవలు, త్యాగాలు స్మరించుకోవడం సామాజిక బాధ్యతన్నారు. వారి త్యాగాలకు ప్రతీకగా యువత ముందుకొచ్చి రక్తదానం చేయడం నిజమైన నివాళి అన్నారు. ఎస్సై రక్తదాతలకు కృతజ్ఞతలు తెలిపారు. రక్తదాతలకు ఆర్డీవో ప్రశంసా పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు దామిశెట్టి సుధీర్‌నాయుడు, జిల్లా పాలకమండలి సభ్యులు గంధం ప్రసన్నాంజనేయులు, రైల్వే పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-30T03:28:50+05:30 IST