రక్తదానంతో మరొకరికి ప్రాణదానం

ABN , First Publish Date - 2021-10-29T04:38:03+05:30 IST

రక్తదానంతో మరొకరికి ప్రాణదానం

రక్తదానంతో మరొకరికి ప్రాణదానం
రక్తదాన శిబిరంలో పాల్గొన్న ఎమ్మెల్యే కిలివేటి, డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి

ఎమ్మెల్యే కిలివేటి 

నాయుడుపేట, అక్టోబరు 28 : రక్తదానంతో మరొకరికి ప్రాణదానం కలుగుతుందని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు.  పోలీసుల అమరవీరుల సంస్కరణ దినం పురస్కరించుకొని స్థానిక కేకే కల్యాణ సదన్‌లో నాయుడుపేట సీఐ సోమయ్య ఆధ్వర్యంలో గురువారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, గూడూరు డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని  ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పోలీస్‌శాఖ ఈ శిబిరం నిర్వహించడం శుభపరిణామం అన్నారు. విధి నిర్వహణలో అమరవీరులైన పోలీసులకు నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ కురుగొండ ధనలక్ష్మి, వైస్‌చైర్మన్‌ జలదంకి వెంకటకృష్ణారెడ్డి, నాయుడుపేట, పెళ్లకూరు, దొరవారిసత్రం ఎస్‌ఐలు కృష్ణారెడ్డి, మనోజ్‌కుమార్‌, తిరుమలరావు, వైసీపీ నాయకులు తంబిరెడ్డి సుబ్రహ్మణ్యంరెడ్డి, కట్టా రమణారెడ్డి, కామిరెడ్డి రాజారెడ్డి, పోట్లపూడి రాజేష్‌, గంధవళ్లి సిద్ధయ్య, కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-29T04:38:03+05:30 IST