బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో రక్తదానం

ABN , First Publish Date - 2021-11-03T04:11:49+05:30 IST

బీజేపీ యువమోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శి అక్కిలగుంట జీవ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం రెడ్‌క్రాస్‌లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.

బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో రక్తదానం
రక్తదానం చేస్తున్న బీజేపీ యువమోర్చా కార్యకర్తలు

కావలిటౌన్‌, నవంబరు 2: బీజేపీ యువమోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శి అక్కిలగుంట జీవ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం రెడ్‌క్రాస్‌లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని బీజేపీ పట్టణ అధ్యక్షుడు కె.బ్రహ్మానందం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కావలి రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ రవిప్రకాష్‌, కార్యదర్శి గంధం ప్రసన్న, బీజేపీ పట్టణ ఉపాధ్యక్షుడు బాలు యాదవ్‌, పట్టణ కార్యదర్శి మంద కిరణ్‌, సవీండ్ర, వంశీ, కామెనేని ఉదయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-03T04:11:49+05:30 IST