బీజేపీతోనే బీసీలకు రాజ్యాధికారం : పసుపులేటి సుధాకర్‌

ABN , First Publish Date - 2021-01-08T02:09:06+05:30 IST

బీజేపీతోనే బీసీలకు రాజ్యాధికారం సిద్ధిస్తుందని బీజేపీ ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పసుపులేటి

బీజేపీతోనే బీసీలకు రాజ్యాధికారం : పసుపులేటి సుధాకర్‌
ప్రచార రథంపై పసుపులేటి సుధాకర్‌, జిల్లా అధ్యక్షుడు భరత్‌


కావలిటౌన్‌, జనవరి7: బీజేపీతోనే బీసీలకు రాజ్యాధికారం సిద్ధిస్తుందని బీజేపీ ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పసుపులేటి సుధాకర్‌ పేర్కొన్నారు. బీజేపీ ఓబీసీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితులై గురువారం కావలికి చేరుకున్న పసుపులేటికి జీజేపీ కార్యకర్తలు, నాయకులు, పసుపులేటి అభిమానులు పట్టణ ఉత్తర శివారులోని మద్దూరుపాడు ట్రంకురోడ్డులో ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి భారీ బైక్‌ ర్యాలీగా వారు వెంటరాగా ర్యాలీ ముందు భాగాన నాలుగు గుర్రాలతో కూడిన వాహనంలో పసుపులేటి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు జీ భరత్‌ కుమార్‌, పట్టణ అధ్యక్షుడు కె బ్రహ్మానందంతో కలిసి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకుసాగారు. బ్రిడ్జి కూడలిలో టాప్‌లెస్‌ జీప్‌పై నుంచి పసుపులేటి మాట్లాడుతూ అన్ని పార్టీలు ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకొచ్చి వారి పబ్బం గడుపుకున్నారేగానీ ప్రజా సంక్షేమం గురించి చేసిందేమీ లేదన్నారు. బీసీలందరూ ఏకమై దేశ ప్రదాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీతో జతకట్టాలని, బీజేపీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. కావలి ఎమ్మెల్యేపై, వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు భరత్‌ ధ్వజమెత్తారు. పట్టణ దక్షిణ శివారులోని పమిడి స్కూల్‌ వరకు ర్యాలీ కొనసాగింది. బృందావనం కాలనీవద్ద బీజేపీ పట్టణ ఉపాధ్యక్షుడు పొన్నగంటి మురళీకృష్ణ ఆధ్వర్యంలో స్వాగతం పలికారు.  కార్యక్రమంలో బీజేపీ మహిళామోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు సుభాషిణి,  పసుపులేటి వెంకటేశ్వర్లు, గుర్రంకొండ అరుణ్‌, రాజ్యలక్షి, వెంకయ్య, దామోదర్‌ నాయుడు, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-01-08T02:09:06+05:30 IST