బిపిన్ రావత్‌కు నివాళులు
ABN , First Publish Date - 2021-12-10T03:14:45+05:30 IST
హెలికాప్టర్ ప్రమాదంలో అసువులు బాసిన త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ దంపతులకు, ఇతర సైన్యాధికారులకు గురువారం రాత్రి టీమ్

కావలి, డిసెంబరు9: హెలికాప్టర్ ప్రమాదంలో అసువులు బాసిన త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ దంపతులకు, ఇతర సైన్యాధికారులకు గురువారం రాత్రి టీమ్ సేవియర్స్ సంస్థ ఆధ్వర్యంలో కావలిలో కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. రెడ్‌క్రాస్ భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీమ్ సేవియర్స్ ప్రతినిధి ధీరజ్ మాట్లాడుతూ 42 ఏళ్లు దేశానికి సేవలందించి, అనేక యుద్ధాల్లో విజయం సాధించి పెట్టిన బిపిన్ రావత్ సతీసమేతంగా ప్రాణాలు పోగొట్టుకు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీమ్ సేవి యర్స్ ప్రతినిధులు ప్రణీత్, మనీష్, వినీల్, పవన్, రమణ్, రెడ్‌క్రాస్ బాధ్యులు రవిప్రకాష్, గ్రంధం ప్రసన్నాంజనేయు లు, హనుమకుమార్, హరినారపరెడ్డి, కొండలరావు, జము న, పద్మావతి, రెడ్‌క్రాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఉదయగిరిలో..
ఉదయగిరి రూరల్, డిసెంబరు 9: హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందిన త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్‌కు గురువారం వివేకానంద యూత్ ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. జూనియర్ కళాశాల విద్యార్థులు పంచాయతీ బస్టాండ్ సెంటర్‌లో కొవ్వొత్తులు చేతపట్టి మానవహారం ఏర్పాటు చేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మధుకిరణ్, వివేకానంద యూత్ నాయకులు భూపతిరాజ, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
దుత్తలూరులో..
దుత్తలూరు, డిసెంబరు 9: బిపిన్ రావత్ మృతికి గురువారం బీజేపీ నాయకులు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, దేశానికి చేసిన ఆయన చేసిన సేవలను కొనియారు. కార్యక్రమంలో మండల బీజేపీ కన్వీనర్ చుండి హరిగోపాల్‌రెడ్డి, జిల్లా యువమోర్చా నాయకులు మేకపాటి మాల్యాద్రినాయుడు, తదితరులు పాల్గొన్నారు.

