భవన నిర్మాణాల్లో ఉదయగిరి ప్రథమస్థానం

ABN , First Publish Date - 2021-06-23T03:20:06+05:30 IST

జిల్లాలో సచివాలయాలు, రైతు భరోసా, ఆరోగ్య ఉప కేంద్రాల భవన నిర్మాణాల్లో ఉదయగిరి నియోజకవర్గం ప్రథమ స్థానంలో ఉందని పంచాయతీరాజ్‌ శాఖ ఎస్‌ఈ శ్రీనివాసులరెడ్డి తెలిపారు.

భవన నిర్మాణాల్లో ఉదయగిరి ప్రథమస్థానం
అధికారులతో సమీక్షిస్తున్న ఎస్‌ఈ శ్రీనివాసులరెడ్డి

పీఆర్‌ ఎస్‌ఈ శ్రీనివాసులరెడ్డి 

ఉదయగిరి రూరల్‌, జూన్‌ 22: జిల్లాలో సచివాలయాలు, రైతు భరోసా, ఆరోగ్య ఉప కేంద్రాల భవన నిర్మాణాల్లో ఉదయగిరి నియోజకవర్గం ప్రథమ స్థానంలో ఉందని పంచాయతీరాజ్‌ శాఖ ఎస్‌ఈ శ్రీనివాసులరెడ్డి తెలిపారు. భవన నిర్మాణ పక్షోత్సవాల్లో భాగంగా మంగళవారం మండలంలోని పలు భవన నిర్మాణాలను ఆయన పరిశీలించారు. అనంతరం స్థానిక కార్యాలయంలో అధికారులు, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌లతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గంలో సచివాలయాలు 95, ఆర్‌బీకేలు 95, ఆరోగ్య కేంద్రాలు 78 నిర్మాణాలు జరుగుతుండగా 71 సచివాలయాలు, 40 ఆర్‌బీకేలు, 17 ఆరోగ్య ఉప కేంద్రాలు నిర్మాణ పనులు పూర్తి కాగా, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయన్నారు. జులై 8న వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా 26 ఆర్‌బీకేలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. మిగిలిన భవనాలు కూడా సకాలంలో పూర్తి చేసేలా గుత్తేదారులను ప్రోత్సహించాలన్నారు. జిల్లాలో 659 సచివాలయాల నిర్మాణాలు 40 శాతం, 659 ఆర్‌బీకేలు 40 శాతం, 553 ఆరోగ్య ఉప కేంద్రాలు 10 శాతం మాత్రమే పూర్తయ్యాయన్నారు. జనవరి 15 తరువాత భవన నిర్మాణాలకు రూ.35 కోట్లు బిల్లులు పెట్టగా రూ.5 కోట్లు మాత్రమే విడుదలయ్యాయన్నారు. భవన నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసిన సందర్భంగా డీఈఈ సుబ్బారెడ్డి, ఏఈ వాణి, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు సంయుక్త, పవన్‌లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో సురేష్‌, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-23T03:20:06+05:30 IST