భాదిత కుటుంబాలకు అండగా టీడీపీ

ABN , First Publish Date - 2021-12-31T04:22:49+05:30 IST

పంబలేరువాగులో మృతి చెందిన యువకుల కుటుంబ సభ్యులకు టీడీపీ అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్‌ తెలిపారు.

భాదిత కుటుంబాలకు అండగా టీడీపీ
భాదితకుటుంబసభ్యులకు ఆర్థిక సాయం అందిస్తున్న మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్‌, టీడీపీ నాయకులు

గూడూరు, డిసెంబరు 30: పంబలేరువాగులో మృతి చెందిన యువకుల కుటుంబ సభ్యులకు టీడీపీ అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్‌ తెలిపారు. గురువారం మండలంలోని పోటుపాళెంలో ఇటీవల మృతిచెందిన ఇద్దరు యువకుల కుటుంబసభ్యులను పరామర్శించి రూ. 10 వేలు ఆర్థికసాయం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామానికి చెందిన భగవాన్‌, పవన్‌ అనే యువకులు పొలానికి వెళ్లేందుకు పంబలేరు వాగు దాటుతూ మృతిచెందడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో నెలబల్లి భాస్కర్‌రెడ్డి, బిల్లు చెంచురామయ్య, కొండూరు వెంకటేశ్వర్లురాజు, చంద్రమౌళి, నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-31T04:22:49+05:30 IST