అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన
ABN , First Publish Date - 2021-04-17T05:58:19+05:30 IST
వేసవిలో అగ్నిప్రమాదాలు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రజలు ముందస్తు చర్యలు చేపడితే నివారించవచ్చని అగ్నిమాపకదళ అధికారి రమేష్ పేర్కొన్నారు.
ఆత్మకూరు, ఏప్రిల్ 16: వేసవిలో అగ్నిప్రమాదాలు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రజలు ముందస్తు చర్యలు చేపడితే నివారించవచ్చని అగ్నిమాపకదళ అధికారి రమేష్ పేర్కొన్నారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం వారం ఆత్మకూరు ఎస్సీ కాలనీ తదితర ప్రాంతాల్లో అగ్నిమాప క ప్రమాదాల నివారణపై చేపట్టాల్సిన చర్యలను విపులీకరించారు. ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక దళ సిబ్బంది పాల్గొన్నారు.