ఆవులను చంపేందుకు ఉచ్చులు

ABN , First Publish Date - 2021-05-19T03:32:42+05:30 IST

పట్టణంలోని బండగానిపల్లి మార్గంలో ఉన్న కొత్తచెరువు ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం ఆవులను

ఆవులను చంపేందుకు ఉచ్చులు
ఉచ్చులో ఇరుక్కున్న ఆవు

ఉదయగిరి రూరల్‌, మే 18: పట్టణంలోని బండగానిపల్లి మార్గంలో ఉన్న కొత్తచెరువు ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం ఆవులను చంపేందుకు ఉచ్చులు ఏర్పాటు చేశారు. అటుగా వాకింగ్‌ వెళుతున్న మట్ల లక్ష్మయ్య అనే వ్యక్తి వాటిని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఏఎస్‌ఐ శ్రీనివాసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఉచ్చులు వేసిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఉచ్చులో ఇరుక్కున్న ఆవును రక్షించారు. ఆవులను చంపేందుకు ఉచ్చులు వేసినవారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకొంటామని ఆయన హెచ్చరించారు. 


Updated Date - 2021-05-19T03:32:42+05:30 IST