మౌలానా అబుల్ కలాం ఆజాద్‌పై ఆడియో విడుదల
ABN , First Publish Date - 2021-03-06T05:16:18+05:30 IST
దేశ తొలి విద్యాశాఖ మంత్రి, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జీవితంపై రూపొందించిన ఆడియో సీడీని శుక్రవారం రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ఆవిష్కరించారు.
నెల్లూరు(వీఆర్సీ), మార్చి 5 : దేశ తొలి విద్యాశాఖ మంత్రి, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జీవితంపై రూపొందించిన ఆడియో సీడీని శుక్రవారం రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ఆవిష్కరించారు. కలెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబు సహకారంతో గూడూరుకు చెందిన వేగూరు విజయకుమార్ ఈ గేయాన్ని రాసి స్వరపరిచారు. ఆజాద్ జీవిత చరిత్రను పాట ద్వారా ప్రజలకు తెలియజేయాలని సంకల్పించి సీడీని రూపొందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి సయ్యద్ అబ్దుల్ హమీద్, రూప్‌కుమార్ యాదవ్, షేక్ హాజీ, చైతన్య తదితరులు పాల్గొన్నారు.