టీడీపీలో పలువురి చేరిక

ABN , First Publish Date - 2021-10-30T05:04:59+05:30 IST

నగరంలోని 32వ డివిజన్‌కు చెందిన పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారు. అహ్మద్‌ బాషా ఆధ్వర్యంలో సుమారు వంద మంది పార్టీలో చేరగా వారందరికీ టీడీపీ నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌ కండువాలు కప్పి ఆహ్వానించారు.

టీడీపీలో పలువురి చేరిక
టీడీపీలో చేరిన వారితో అజీజ్‌

నెల్లూరు, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి) : నగరంలోని 32వ డివిజన్‌కు చెందిన పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారు. అహ్మద్‌ బాషా ఆధ్వర్యంలో సుమారు వంద మంది పార్టీలో చేరగా వారందరికీ టీడీపీ నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌ కండువాలు కప్పి ఆహ్వానించారు. 32వ డివిజన్‌లోని సంజయ్‌గాంధీ నగర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో అజీజ్‌ మాట్లాడుతూ రెండన్నరేళ్లకే వైసీపీ అసమర్థ పాలన ప్రజలకు అర్థమైందన్నారు. వైసీపీ పాలనలో అన్ని వర్గాలు కుదేలయ్యాయని విమర్శించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాడేందుకు అనేక మంది తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని చెప్పారు. త్వరలో జరగనున్న కార్పొరేషన్‌ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జన్ని రమణయ్య, మాజీ కౌన్సిలర్‌ నావూరు శైలేంద్రబాబు, జలదంకి సుధాకర్‌, సాబీర్‌ ఖాన్‌, తోట సునీల్‌, అస్లాం, రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-30T05:04:59+05:30 IST