అప్రమత్తంగా ఉండండి!

ABN , First Publish Date - 2021-09-19T05:35:40+05:30 IST

పరిషత్‌ ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సిహెచ్‌ విజయరావు దిశానిర్ధేశం చేశారు.

అప్రమత్తంగా ఉండండి!

అల్లర్లు జరగకుండా కేంద్రాలను స్వాధీనంలోకి తీసుకోవాలి

ఎస్పీ సిహెచ్‌ విజయరావు


నెల్లూరు (క్రైం), సెప్టెంబరు 18 : పరిషత్‌ ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సిహెచ్‌ విజయరావు దిశానిర్ధేశం చేశారు. నగరంలోని ఉమేష్‌చంద్ర హాలులో శనివారం స్పందన ఫిర్యాదులు, ఓట్ల లెక్పింపులపై అధికారులు, సిబ్బందితో ఎస్పీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఓట్ల లెక్పింపు కేంద్రాల వద్ద ఎలాంటి అల్లర్లు జరగకుండా కేంద్రాలను స్వాధీనం చేసుకవాఆలన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమగ్ర నివేదిక జిల్లా కేంద్రానికి పంపాలన్నారు. గుర్తింపు కార్డులు లేకుండా కేంద్రాలలోకి ఏజెంట్లను అనుమతించవద్దని సూచించారు. ఇతర జిల్లాల నుంచి మద్యం అక్రమంగా సరఫరా కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కౌంటింగ్‌ హాల్‌కు 100 మీటర్ల దూరం వరకు కౌంటింగ్‌కు సంబంధం లేని వ్యక్తులకు ప్రవేశం లేదన్నారు.

కౌంటింగ్‌ ప్రక్రియకు పది కేంద్రాల పరిధిలో సబ్‌డివిజన్ల వారీగా 11 మంది డీఎస్పీలు, 21 మంది సీఐలు, 71 మంది ఎస్‌ఐలు, 193 మంది ఏఎస్‌ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, 392 మంది కానిస్టేబుళ్లు, 125 మంది మహిళ కానిస్టేబుళ్లు, 133 మంది హోమ్‌గార్డులు, 12 స్పెషల్‌ పార్టీలు, 20 డీఎఫ్‌ఎండీ పార్టీలు ఇలా మెత్తం 1126 మంది సిబ్బందిని నియమించారు.

ఇక రిజర్వులో 1 డీఎస్పీ, 2 సీఐలు, 2 ఎస్‌ఐలు, 25 మంది కానిస్టేబుళ్లు, 2 స్పెషల్‌ పార్టీలు, ఇలా 50 మంది సిబ్బందని అందుబాటులో ఉంచారు. 

మద్యం దుకాణాల మూత

కౌంటింగ్‌ జరగనున్న పది కేంద్రాల పరిధిలో ఐదు కిలోమీటర్ల వరకు ప్రభుత్వ మద్యం దుకాణాలు, బార్లు తెరుచుకోవని ఈఎస్‌ వెంకటరామిరెడ్డి ఒక ప్రకనటలో తెలిపారు. సోమవారం యథావిధిగా దుకాణాలు తెరుచుకోనున్నాయి.


నేటి నుంచి ఇంటర్‌ మూల్యాంకనం

నెల్లూరు (విద్య), సెప్టెంబరు 18 : ప్రస్తుతం జరుగుతున్న ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకనం ఆదివారం నుంచి ప్రారంభిస్తున్నట్లు ఆర్‌ఐవో వరప్రసాద్‌ తెలిపారు. నెల్లూరులోని కేఏసీ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో తొలిరోజు సంస్కృతం, హిందీ పరీక్ష పత్రాల మూల్యాంకనం ఉదయం 10 గంటల నుంచి జరుగుతుందన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో పనిచేసే సంస్కృతం, హిందీ అధ్యాపకులను సంబంధిత ప్రిన్సిపాళ్లు వెంటనే రిలీవ్‌ చేసి మూల్యాంకనం విధులకు హాజరయ్యేలా చర్యలు చేపట్టాలని ఆర్‌ఐవో ఆదేశించారు. కాగా, శనివారం జరిగిన పరీక్షలకు ప్రఽథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కలిపి మొత్తం 18,164 మంది హాజరయ్యారు. ఉదయం జరిగిన ఫస్టియర్‌ పరీక్షకు జనరల్‌, ఒకేషనల్‌ విద్యార్థులు 25,182 మంది హాజరు కావాల్సి ఉండగా 18,033 మంది హాజరయ్యారు. 7,149 మంది గైర్హాజరయ్యారు. మధ్నాహ్నం జరిగిన ద్వితీయ సంవత్సరం పరీక్షకు  23,653 మంది హాజరు కావాల్సి ఉండగా 131 మంది హాజరయ్యారు. 

====================

Updated Date - 2021-09-19T05:35:40+05:30 IST