బీజేపీ అనుబంధ విభాగాలకు అధ్యక్షుల నియామకం

ABN , First Publish Date - 2021-01-14T04:51:23+05:30 IST

భారతీయ జనతా పార్టీ అనుబంధ విభాగాలకు జిల్లా అధ్యక్షులను ఆ పార్టీ నెల్లూరు పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు గుండ్లపల్లి భరత్‌కుమార్‌ యాదవ్‌ బుధవారం ప్రకటించారు.

బీజేపీ అనుబంధ విభాగాలకు అధ్యక్షుల నియామకం

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), జనవరి 13: భారతీయ జనతా పార్టీ అనుబంధ విభాగాలకు జిల్లా అధ్యక్షులను ఆ పార్టీ నెల్లూరు పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు గుండ్లపల్లి భరత్‌కుమార్‌ యాదవ్‌ బుధవారం ప్రకటించారు. ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా ముక్కురాధాకృష్ణ గౌడ్‌, యువమోర్చా అఽధ్యక్షుడిగా ఎన్‌ యశ్వంత్‌సింగ్‌, కిసాన్‌ మోర్చా అధ్యక్షుడిగా కాలం బుజ్జిరెడ్డి, మహిళా మోర్చా అధ్యక్షురాలిగా కే రాజేశ్వరమ్మ, ఎస్టీ మోర్చా అధ్యక్షుడిగా పోట్లూరు శ్రీనివాసులు, మైనారిటీ మోర్చా అధ్యక్షుడిగా ఎస్‌కే అస్లామ్‌ను ఎంపిక చేశారు. ఎంపికైన నాయకులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని భరత్‌ కుమార్‌ సూచించారు. 

Updated Date - 2021-01-14T04:51:23+05:30 IST