ప్లైవోవర్ పనులు త్వరలో ప్రారంభిస్తాం : ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2021-02-27T03:36:47+05:30 IST
పట్టణంలోని పెద్దపవని రోడ్డులో కలుగోళ్లశాంభవి ఆలయం మీదుగా నిర్మిస్తున్న ప్లైవోవర్ అసంపూర్తి పనులు పూర్తి చేసేందుకు త్వరలో పనులు ప్రాంభించి ప్రజల అసౌకర్యాన్ని తొలగిస్తామని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

కావలి, ఫిబ్రవరి 26: పట్టణంలోని పెద్దపవని రోడ్డులో కలుగోళ్లశాంభవి ఆలయం మీదుగా నిర్మిస్తున్న ప్లైవోవర్ అసంపూర్తి పనులు పూర్తి చేసేందుకు త్వరలో పనులు ప్రాంభించి ప్రజల అసౌకర్యాన్ని తొలగిస్తామని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అక్కడ రైల్వే అండర్ పాస్ దారి పునరుద్ధరణ పనులను శుక్రవారం ఎమ్మెల్యే పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్లైవోవర్ వంతెన లేక రైల్వే అండర్‌పాస్‌ను మూసి వేయటం వలన రాకపోకలకు ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి రైల్వే అధికారులతో చర్చించి అండర్ పాస్ దారి పునరుద్ధరణకు చర్యలు చేపట్టామన్నారు. అలాగే అన్నపుగుంట సుందరీకరణకు రూ.20 లక్షలు మంజూరు చేయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ మెట్టుకూరు ధనుంజయరెడ్డి, కావలి ఏఎంసీ చైర్మన్ మన్నెమాల సుకుమార్‌రెడ్డి, వైసీపీ నేతలు కేతిరెడ్డి శివకుమార్‌రెడ్డి, కనమర్లపూడి నారాయణ, జనిగర్ల మహేంద్ర యాదవ్, అమరావేదగిరి, తలపనేని ప్రభాకర్, ఏటూరి పిచ్చిరెడ్డి, గుడ్లూరు మాల్యాద్రి, యోగూరు చినపుల్లయ్య, కామరాజు, కుందుర్తి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.