బాలాలయానికి అంకురార్పణ

ABN , First Publish Date - 2021-11-24T05:03:25+05:30 IST

నాయుడుపేట - తుమ్మూరులో ఉన్న గంగా కామాక్షి సమేత శ్రీ నీలకంఠేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం రాత్రి బాలా లయానికి అంకురార్పణ నిర్వహించారు.

బాలాలయానికి అంకురార్పణ

 టీటీడీ డిప్యూటీ ఈవో రాజేంద్రుడు హాజరు

నాయుడుపేట టౌన్‌, నవంబరు 23 : నాయుడుపేట - తుమ్మూరులో ఉన్న గంగా కామాక్షి సమేత శ్రీ నీలకంఠేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం రాత్రి బాలా లయానికి అంకురార్పణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీటీడీ స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ ఈవో రాజేంద్రుడు హాజరయ్యారు. ఆలయంలో ధ్వజస్తంభం, కామాక్షి అమ్మ వారు, గణపతి, చండీకేశ్వరస్వాముల విగ్రహాలు  పురాతమైనందున నూతనంగా నిర్మించేందుకు తిరుమల, తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో అంకుర్పాణను  ప్రారంభించారు. వేదికార్చన, యాగశాల పూజ, హోమం, లఘుపూర్ణాహుతి, నివేదన హారతి, తీర్థప్రసాద వినియోగం తదితర పూజలు నిర్వహించారు.  కార్యక్రమంలో టీటీడీ ఏఈవో రవికుమార్‌రెడ్డి, ఆగమ అడ్వయిజర్‌ సత్యనారాయణమూర్తి, ఇన్‌స్పెక్టర్లు సుధీర్‌, హరిబాబు, వేదపండితులు, భక్తులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-24T05:03:25+05:30 IST