అందరికీ వ్యాక్సిన్లు వేయాలి : పోలంరెడ్డి

ABN , First Publish Date - 2021-05-09T03:31:50+05:30 IST

andariki vaccin veyali టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడి పిలుపు మేరకు శనివారం తన ఇంట్లో మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, తె polam redyy

అందరికీ వ్యాక్సిన్లు వేయాలి : పోలంరెడ్డి
నిరసనలో మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి

కోవూరు, మే8 : టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడి పిలుపు మేరకు శనివారం తన ఇంట్లో మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, తెలుగుయువత రాష్ట్ర ప్రధానకార్యదర్శి పోలంరెడ్డి దినేష్‌రెడ్డితో కలిసి నిరసన చేపట్టారు. ప్రజలందరికీ వ్యాక్సిన్లు వేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలంరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రానికి 5కోట్ల వ్యాక్సిన్లు అవసరం కాగా ప్రభుత్వం కేవలం 15లక్షల వ్యాక్సిన్లను మాత్రమే కొనుగోలు చేసిందన్నారు. రాష్ట్ర బడ్జెటులో రూ 1600 కేటాయించాల్సి ఉండగా కేవలం రూ 45 కోట్లు మాత్రమే విడుదల చేయడం ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్ది అవగాహనా రాహిత్యాన్ని తెలియచేస్తోంద న్నారు.  ప్రభుత్వం ప్రతి మండలంలో కొవిడ్‌సెంటర్‌ను ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలందరికీ వ్యాక్సిన్‌ వేయాల్సిందిగా ఆయన డిమాండు చేశారు. కోవూరులో టీడీపీ నాయకులు బాలరవి, చౌదరి, చామంతిపురం వెంకటేశ్వర్లు నిరసన చేపట్టారు. 


Updated Date - 2021-05-09T03:31:50+05:30 IST