వైఎస్సార్‌ చేయూతతో జీవనోపాధి

ABN , First Publish Date - 2021-06-23T02:46:54+05:30 IST

వైఎస్సార్‌ చేయూత, జగనన్నతోడు పథకాలతో మండలంలో మొత్తం 4,824 కుటుంబాలు జీవనోపాధిని పొందాయని ఎమ్మెల్యే నల్ల

వైఎస్సార్‌ చేయూతతో జీవనోపాధి
లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేస్తున్న కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న

బుచ్చిరెడ్డిపాళెం,జూన్‌22: వైఎస్సార్‌ చేయూత, జగనన్నతోడు పథకాలతో మండలంలో మొత్తం 4,824 కుటుంబాలు జీవనోపాధిని పొందాయని  ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. మంగళవారం బుచ్చి ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వైఎస్సార్‌ చేయూత, జగనన్నతోడు పథకాల లబ్ధ్దిదారుల బ్యాంకు ఖాతాలకు నగదు జమ అయినట్లు తెలిపారు. ముందుగా చిరువ్యాపారులు ఏర్పాటు చేసిన కిరాణా సరుకులు,చీరలు, పొట్టేళ్లు, ఎండుచేపలు,పూలు, పండ్లు, కూరగాయలు తదితరాల స్టాల్స్‌ను ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేతోపాటు ఏపీఎం లలిత, మండల అధికారులు లబ్ధిదారులకు చెక్కులు పంణీ చేశారు.  కార్యక్రమంలో వవ్వేరు బ్యాంకు చైర్మన్‌ సూరా శ్రీనివాసులురెడ్డి, బుచ్చి బ్యాంకు చైర్మన్‌ మేనకూరు సీతారామిరెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ దొడ్డంరెడ్డి నిరంజన్‌బాబు రెడ్డి, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.


Updated Date - 2021-06-23T02:46:54+05:30 IST