అర్హులందరికీ వైఎస్‌ఆర్‌ చేయూత అందిస్తాం : కాకాణి

ABN , First Publish Date - 2021-06-23T02:58:04+05:30 IST

సర్వేపల్లి నియోజకవర్గంలో అర్హులందరికీ వైఎస్‌ఆర్‌ చేయూత పథకాన్ని అందించడమే లక్ష్యంగా పని చేస్తామని ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి పే

అర్హులందరికీ వైఎస్‌ఆర్‌ చేయూత అందిస్తాం  : కాకాణి
లబ్ధిదారులతో కలిసి చెక్కును ప్రదర్శిస్తున్న ఎమ్మెల్యే కాకాణి


వెంకటాచలం, జూన్‌ 22 : సర్వేపల్లి నియోజకవర్గంలో అర్హులందరికీ వైఎస్‌ఆర్‌ చేయూత పథకాన్ని అందించడమే లక్ష్యంగా పని చేస్తామని ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని చవటపాళెం పంచాయతీ సరస్వతి వద్ద ఉన్న కమ్యూనిటీ సెంటర్‌లో వైఎస్‌ఆర్‌ చేయూత పథకం కింద 14,466 మంది లబ్ధిదారులకు సంబంధించి విడుదలైన ఆర్ధిక సహాయం రూ.27 కోట్ల 12 లక్షల రూపాయల చెక్కులను మంగళవారం లబ్ధిదారులతో కలిసి ఆయన ప్రదర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హత కలిగిన వారికి ఏదైనా కారణాలతో అందకపోతే తప్పనిసరిగా వారికి కూడా అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఆసరా జేసీ బాపిరెడ్డి, జడ్పీ సీఈవో సుశీల, ఏరియా కో-ఆర్డినేటర్‌ శ్రీనివాసులు, వెలుగు ఏపీఎం అనిలా, నాయకులు మందల వెంకటశేషయ్య, కనుపూరు కోదండరామిరెడ్డి, వేమారెడ్డి రఘనందన్‌రెడ్డి తదితరులున్నారు. 


Updated Date - 2021-06-23T02:58:04+05:30 IST