అరె్స్టలతో ఉద్యమాలు ఆపలేరు
ABN , First Publish Date - 2021-11-27T04:24:03+05:30 IST
అత్యాచారానికి గురైన రామానుజపురం బాలిక కేసులో నిందితులను అరెస్ట్ చేయమని ఉద్యమం చేస్తే పోలీసులు ఉద్యమ నాయకులను అరెస్ట్ చేయడమేమిటని, అరెస్టలతో ఉద్యమాన్ని ఆపలేరని అత్యాచార వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు పేర్కొన్నారు.

త్వరలో చలో రామానుజపురం
కావలి, నవంబరు 26: అత్యాచారానికి గురైన రామానుజపురం బాలిక కేసులో నిందితులను అరెస్ట్ చేయమని ఉద్యమం చేస్తే పోలీసులు ఉద్యమ నాయకులను అరెస్ట్ చేయడమేమిటని, అరెస్టలతో ఉద్యమాన్ని ఆపలేరని అత్యాచార వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు పేర్కొన్నారు. స్థానిక జర్నలి్స్టక్లబ్లో శుక్రవారం విలేకరుల సమావేశంలో పోరాట కమిటీ కన్వీనర్ పీ.అంబేద్కర్, కో కన్వీనర్లు సీ.శారద, అబ్దుల్ అలీమ్, నేతలు గోచిపాతల వెంకటేశ్వర్లు, డేగా సత్యనారాయణ, పీ. పెంచలయ్య, కరువాది భాస్కర్ మాట్లాడారు. నిందితులను అరెస్ట్ చేస్తే ఉద్యమాలు ఎందుకు చేస్తారని ప్రశ్నించారు. ఈ కేసులో ఆది నుంచి పోలీసులు ప్రవర్తిస్తున్న తీరు పలు అనుమానాలకు తావిస్తుందన్నారు. అధికార పార్టీ నేతలకు తలొగ్గే పోలీసులు ఈ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారనేందుకు అనేక ఆధారాలు ఉన్నాయన్నారు. నిందితులను అరెస్ట్ చేయాలని శాంతియుతంగా ర్యాలీ చేయటానికి వచ్చిన వారిని అరెస్ట్ చేసి దేశ ద్రోహులు లాగా జలదంకి, కావలి పోలీస్ స్టేషన్లలో సాయంత్రం వరకు ఉంచి ఆ తర్వాత అరె్స్టలు చూపించడం ఏమిటని ప్రశ్నించారు. కావలి పోలీసులు రాజ్యాంగాన్నే ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు. జిల్లా ఎస్పీకి ఈ కేసులో కావలి డీఎస్పీ డీ.ప్రసాద్ తప్పుడు సమాచారం ఇచ్చి కేసు తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఉద్యమకారులపై పోలీసులు వ్యవహరించిన తీరుపై కావలి డీఎస్పీ ప్రసాద్, ఒకటో పట్టణ సీఐ శ్రీనివారావులపై మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేసి కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. జిల్లా ఎస్పీకి చిత్తశుద్ధి ఉంటే కావలి డీఎస్పీపై విచారణకు ఆదేశించాలన్నారు. త్వరలో చలో రామానుజపురం వెళ్లి నిందితులను తామే పట్టుకుని పోలీసులకు అప్నగిస్తామన్నారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు ఏసు మాదిగ, జానకి, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.