జ్ఞాననేత్రుడి పాదయాత్రకు సంపూర్ణ మద్దతు

ABN , First Publish Date - 2021-12-31T05:07:22+05:30 IST

చట్టసభల్లో జ్ఞాననేత్రులకు ఒక శాతం రిజర్వేషన్‌ కల్పించాలని కోరుతూ జ్ఞాననేత్రుడు పొన్నలూరు శ్రీనివాసఫణి తిరుపతి తిరుచానూరులోని నవజీవన్‌ బైండ్‌హోం నుంచి ఈనెల 12న చేపట్టిన పాదయాత్ర గురువారం కావలికి చేరుకుంది.

జ్ఞాననేత్రుడి పాదయాత్రకు సంపూర్ణ మద్దతు
జ్ఞాననేత్రుడి పాదయాత్రకు స్వాగతం పలుకుతున్న వామపక్ష, దివ్యాంగుల సంఘ నేతలు

 కావలి, డిసెంబరు30: చట్టసభల్లో జ్ఞాననేత్రులకు ఒక శాతం రిజర్వేషన్‌ కల్పించాలని  కోరుతూ జ్ఞాననేత్రుడు పొన్నలూరు శ్రీనివాసఫణి తిరుపతి తిరుచానూరులోని నవజీవన్‌ బైండ్‌హోం నుంచి  ఈనెల 12న చేపట్టిన పాదయాత్ర గురువారం కావలికి చేరుకుంది.  ఆ పాదయాత్రకు సీపీఎం, సీపీఐ,  దివ్యాంగులసంఘ నాయకులు స్వాగతం పలికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. స్థానిక ఉదయగిరి బ్రిడ్జి కూడలిలో శ్రీనివాసఫణి మాట్లాడుతూ ఒంగోలు పట్టణానికి చెందిన తాను పుట్టకతో అంధుడినైనా ఎవరిపైనా ఆధారపడకుండా ఎంఏ, పీహెచ్‌డీ చదివి సొంత వ్యాపారం చేసుకుంటూ పది మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు తెలిపారు. చట్టసభల్లో అందరికీ ప్రాధాన్యం ఉన్నా అంధులకు లేదని, వారికి ఒక శాతం రిజర్వేషన్‌ కోరుతూ రాజకీయాలకు అతీతంగా విజయవాడ వరకు పాదయాత్ర చేపట్టానని తెలిపారు.  స్వాగతం పలికిన వారిలో సీపీఎం పట్టణ కార్యదర్శి పెంచలయ్య, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి  సత్యం, కొండయ్య, ఎం. అంకయ్య, దివ్యాంగుల సంఘం నాయకుడు మండవ వెంకట్రావు, ముస్లిం వెల్ఫేర్‌ సొసైటీ కావలి పట్టణ వ్యవస్థాపకుడు మస్తాన్‌  ఉన్నారు.

Updated Date - 2021-12-31T05:07:22+05:30 IST