హెల్త్ అలవెన్స్ బకాయిలు చెల్లించాలి
ABN , First Publish Date - 2021-03-25T02:38:44+05:30 IST
మున్సిపల్ కార్మికులకు హెల్త్ అలవెన్స్ బకాయిలను వెంటనే చెల్లించడంతోపాటు పీఎఫ్ నగదును కార్మికుల ఖాతాలో జమ చేయాలని మున్సిపల్

నాయుడుపేట టౌన్, మార్చి 24 : మున్సిపల్ కార్మికులకు హెల్త్ అలవెన్స్ బకాయిలను వెంటనే చెల్లించడంతోపాటు పీఎఫ్ నగదును కార్మికుల ఖాతాలో జమ చేయాలని మున్సిపల్ కార్మికుల యూనియన్ జిల్లా కార్యదర్శి పెంచల నరసయ్య డిమాండ్ చేశారు. నాయుడుపేట సీఐటీయూ కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కేంద్రం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా శుక్రవారం జరిగే భారత్ బంద్‌లో కార్మికులు పాల్గొనాలన్నారు. సీఐటీయూ మండల కార్యదర్శి ముకుంద తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్మిక సంఘ నాయకులు చెంగయ్య, నరసయ్య, పోలయ్య, మహాలక్ష్మమ్మ, సురేష్, తదితరులు పాల్గొన్నారు.